నేడు తణుకులో చంద్రబాబు
తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. దాదాపు పన్నెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు
తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. దాదాపు పన్నెండు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. ఇరగవరం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలుగుదేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలని కోరుతూ చంద్రబాబు ఈ పాదయాత్ర చేస్తున్నారు.
భారీ బందోబస్తు...
దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు పాదయాత్ర చేసే పన్నెండు కిలోమీటర్లు దారిపొడవునా పార్టీ కార్యకర్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయనకు స్వాగతం పలుకుతూ పెద్దయెత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.