Andhra Pradesh : మహానంది క్షేత్రం వద్ద చిరుతపులి కలకలం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది లో చిరుత పులి భక్తులను భయపెట్టింది.

Update: 2024-06-18 02:26 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది లో చిరుత పులి భక్తులను భయపెట్టింది. మహానందిలోని అన్నదానం సత్రం వద్దకు వచ్చిన చిరుత కుక్కను లాక్కెళ్లినట్లు భక్తులు గుర్తించారు. దీంతో భక్తులు భయపడిపోతున్నారు. మహానంది ఆలయ ప్రాంగణంలో చిరుత సంచరిస్తుందన్న ఆందోళనతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరూ రాత్రి వేళ ఒంటరిగా గదుల నుంచి బయటకు రావద్దని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఆలయంపక్కనే...
మరో వైపు మహానంది ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు తమ పెంపుడు జంతువులను వదిలేయకుండా ఉండాలని కూడా అధికారులు చెబుతున్నారు. మహానంది ఆలయం పక్కనే ఉన్న విద్యుత్తు కార్యాలయం వద్దకు చూడా చిరుత పులి వచ్చినట్లు అక్కడి సిబ్బంది కనుగొన్నారు. పెద్దగా ఈలలు వేయడంతో చిరుతపులి అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెబుతున్నారు. చిరుత పులి సంచారంతో మహానంది క్షేత్రంలో రాత్రి వేళ భక్తులు బయటకు రావడానికి భయపడిపోతున్నారు.


Tags:    

Similar News