Chandrababu : అధికారులకు చంద్రబాబు వార్నింగ్

వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు

Update: 2024-09-03 07:21 GMT

వరద సహాయక చర్యల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్క కుటుంబానికి సాయం అందాలని తాను ఆదేశించామని తెలిపారు. వాహనాలను ఒక చోట నిలిపి ఆహార పంపిణీ చేయవద్దని, ఆ యా ప్రాంతాలకు వేర్వేరు వాహనాలను కేటాయించామని, అక్కడకు వెళ్లి వాటిని పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సహాయం కోసం ఏ మెసేజ్ వచ్చినా వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు.

బాధ్యతగా తీసుకోవాలని...
అందరూ బాధ్యతగా తీసుకోవాలని అన్నారు. సింగ్ నగర్ లోని ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులకు తెలిపారు. అధికారులు మానవతా థృక్పథంతో పనిచేయాలని తెలియాలి. చెత్త రాజకీయాలను వదిలి పనిచేయాలని అన్నారు. 37 మంది ఐపీఎస్ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని తెలిపారు. వ్యవస్థలో ఐదేళ్లు పనిచేయడం మానేశారన్నారు. దానిని సరిదిద్దుతున్నామని తెలిపారు. ఆరు హెలికాప్టర్లను వినియోగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి సచివాలయానికి ఒక అధికారిని నియమించామని చెప్పారు.


Tags:    

Similar News