Chandrababu : వాళ్లకు అదిరిపోయే న్యూస్.. రేపు చంద్రబాబు గుడ్‌న్యూస్ ప్రకటనకు రెడీ అయిపోయారట

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలకు వరాలు ప్రకటించాలని రెడీ అయిపోయారు

Update: 2024-06-24 07:55 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంత ప్రజలకు వరాలు ప్రకటించాలని రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించిన ప్రకటన రేపు వెలువడే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రచారం పెద్దయెత్తున నడుస్తోంది. కుప్పం నియోజకవర్గం ప్రజలకు వరాలు ప్రకటించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారట. ఎనిమిది సార్లు తనను వరసగా ఆదరించిన కుప్పం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాలని చంద్రబాబు రెడీ అయిపోయారంట. కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు వరసగా ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు విజయం సాధించారు. అక్కడ ఓటమి అనేది ఆయన ఎరుగరు.

ఎనిమిది సార్లు గెలిపించిన...
1989లో కుప్పం నియోజకవర్గంలో తొలిసారి చంద్రబాబు పోటీ చేశారు. అప్పటి నుంచి విజయమే తప్ప మరొకటి ఎరుగదు. పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ, ప్రచార బాధ్యతలను తాను భుజాన వేసుకున్నప్పటికీ కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబు నిర్వహించకపోయినా ఆయననే ఆదరిస్తూ వస్తున్నారు అక్కడి ప్రజలు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికల్లో వరసగా ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చారు. చంద్రబాబు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం కుప్పం నియోజకవర్గం ప్రజలతోనే సాగింది. మొదటి సారి చంద్రగిరిలో గెలిచినా ఆ తర్వాత కుప్పంను తన కంచుకోటగా చంద్రబాబు మలచుకోగలిగారు.
ఎన్నికల ప్రచారానికి వెళ్లకపోయినా...
గత ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. నోటిఫికేషన్ కు ముందు మాత్రమే కుప్పం వెళ్లివచ్చారు. అక్కడ సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ప్రచారానికి రాకపోయినా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు మళ్లీ చంద్రబాబుకు అత్యథిక మెజారిటీనీ కట్టబెట్టి ముఖ్యమంత్రి అయ్యేందుకు మార్గం సుగమం చేశారు. దీంతో చంద్రబాబు ఈసారి కుప్పం నియోజకవర్గం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి ఒక ఎత్తు.. ఈ ఐదేళ్లు కుప్పంలో జరగబోయే డెవలెప్‌మెంట్ మరొక ఎత్తుగా ఆయన దానిని మలచుకుంటున్నారు. అందులో భాగంగానే కుప్పం ప్రజలకు వరాలు ప్రకటిస్తారని చెబుతున్నారు.
తన పర్యటన సందర్భంగా...
ఈనెల 25, 26వ తేదీలలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించి సమాచారం జిల్లా కలెక్టర్‌ తో పాటు వివిధ శాఖల అధికారులకు వెళ్లింది. గత ప్రభుత్వం హంద్రీనీవా నీరు ఇచ్చామని మోసం చేసిందని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో విమర్శలు చేశారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నుంచి నీరు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. ఇందుకోసం కాల్వలను చంద్రబాబు పరిశీలించి అధికారులకు ఆదేశాలు జారీచేయనున్నారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. పండిన పంటలను కుప్పం నుంచే ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేందుకు అవసరమైన చర్యలపై చంద్రబాబు ప్రకటన చేస్తారని తెలిసింది. దీంతో పాటు అనేక సమస్యలకు ఆయన తన పర్యటనతో ఎండ్ కార్డు వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


Tags:    

Similar News