Chandrababu : మంత్రులకు చంద్రబాబు కీలక ఆదేశాలు.. ఆరు గంటల తర్వాత?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు

Update: 2024-06-26 12:31 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత భారీ బహిరంగ సభలు పెట్టవద్దని సూచించారు. భారీ కాన్వాయ్ తో చప్పుళ్లతో ప్రజలను ఇబ్బంది పెట్ట వద్దని చంద్రబాబు కోరారు. ఏదైనా ఉంటే సాయంత్రం ఆరు గంటలలోపు సమావేశాలు పెట్టాలని, భారీ సభల పేరుతో బలవంతపు జనసమీకరణ చేయవద్దని ఆయన సూచించారు. కుప్పంలో రౌడీయిజం, గంజాయి వంటివి కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో నేతలపై పెట్టిన రౌడీషీట్లు ఎత్తివేయాలని అధికారులను ఆదేశించారు.

వర్చువల్ విధానానికి...
అధికారులు కూడా వర్చువల్ పని విధానానికి అలవాటు పడాలని ఆయన కోరారు. కుప్పం నియోజకవర్గంలో అధికారులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్మార్ వర్క్ తన ప్రభుత్వ విధానమని తెలిపారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను చందరబాబు ఆదేశించారు. కుప్పం నియోజకవర్గం నుంచే పేదరిక నిర్మూలన ప్రారంభం కావాలని చంద్రబాబు తెలిపారు. అందుకు అవసరమైన అన్ని ప్లాన్ ను రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.


Tags:    

Similar News