Chandrababu : అచ్యుతాపురం ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘటనపై హైలెవల్ కమిటీ వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు

Update: 2024-08-22 11:27 GMT

అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘటనపై హైలెవల్ కమిటీ వేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు, తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు, మిగిలిన క్షతగాత్రులకు 25 లక్షల రూపాయలు చెల్లిస్తామని తెలిపారు. ఈరోజే చెక్కులు ఇస్తామని తెలిపారు. రెడ్ కేటగిరీలో ఉండే పరిశ్రమల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులందరూ కలసి సమన్వయంతో కంపెనీలను తనిఖీలు చేయాలన్నారు. భద్రతా ప్రమాణాలను సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలించాలన్నారు. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘటనకు కారణం యాజమాన్యం నిర్లక్ష్యం కారణం అని తెలిసిందన్నారు.

భద్రతా ప్రమాణాలను...
ప్రజల సేప్టీ అన్నింటి కంటే ముఖ్యమని ఆయన తెలిపారు. పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని, అదే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించాలని కూడా చంద్రబాబు తెలిపారు. హైలెవెల్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ఐదేళ్లో 119 ఘటనలు జరిగాయని, 120 మంది చనిపోయారని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కంపెనీ యజమాని టచ్ లో లేకుండా పోయారన్నారు. నిబంధనల ప్రకారం పరిశ్రమలు నడపాలని ఆయన కోరారు. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.


Tags:    

Similar News