Chandrababu : మా ప్రభుత్వం ప్రయారిటీ అదేనన్న చంద్రబాబు

ఈ ఐదేళ్లలో అమరావతిలో అనేక నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.;

Update: 2024-07-05 12:09 GMT

ఈ ఐదేళ్లలో అమరావతిలో అనేక నిర్మాణాలను పూర్తి చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధానికి పూర్వ వైభవం తెచ్చేందుకే తమ ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందన్న ఆయన రాష్ట్రాన్ని పునర్నించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో సరిదిద్దుకోలేనంత నష్టం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు గొప్ప వనరులన్నాయని అన్న చంద్రబాబు గోదావరి నది నుంచే దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ నీరు అందించవచ్నని తెలిపారు.

కేంద్రంలో అధికారంలో...
తాము కేంద్రం ప్రభుత్వంలో చేరినా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగానే పనిచేస్తామని, ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు తమకు అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాము ఎప్పుడూ పదవులను ఆశించేవారం కామని, నాడు కానీ నేడు కానీ వారు ఇచ్చిన పదవులనే తీసుకున్నామని తెలిపారు. ఇచ్చిన రెండు కేంద్ర మంత్రి పదవులతో సంతోషంగా ఉన్నామన్న ఆయన తమ ఫోకస్ అంతా రాష్ట్రాభివృద్ధిపైనే ఉందన్నారు. దావోస్ లో పెట్టుబడుల సదస్సుకు హాజరై మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకు వస్తామని తెలిపారు.


Tags:    

Similar News