Polavaram : పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.. శ్వేతపత్రం విడుదల కార్యక్రమంలో చంద్రబాబు
వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం పూర్తి కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే పోలవరం పూర్తి కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పోలవరంపై ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం కారణంగా 4,900 కోట్ల రూపాయల నష్టం జరిగిందన్న చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో కేవలం 3.84 శాతం పనులే పూర్తయ్యాయని తెలిపారు. 2014 నుంచి టీడీపీ ప్రభుత్వం 72 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. 2018 లో డయాఫ్రం వాల్ ను తాము 436 కోట్లతో పూర్తిచేశఆమన్నారు. దాని మరమ్మతులకే 447 కోట్లు ఖర్చు చేశారన్నారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి 990 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చంద్రబాబు తెలిపారు.
అందువల్లనే ఈ దుస్థితి...
పోలవరం పనుల నుంచి ఏజెన్సీని మార్చడం వల్లనే ఈ దుస్ధితి దాపురించిందని చంద్రబాబు అన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణానికిే రెండు సీజన్లు అవసరమని, కాఫర్ డ్యామ్ సీపేజీ వల్ల ఏ పనులు చేసే పరిస్థితి లేదని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,385 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం దారి మళ్లించిందని తెలిపారు. పోలరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నుంచి నిపుణులను రప్పిస్తున్నామని, వళ్లు అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తారని చంద్రబాబు తెలిపారు. పోలవరం ఆలస్యంతో రైతులకు నలభై ఐదు వేల కోట్లరూపాయల నష్టం జరిగిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని తీసుకుని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఆయన తెలిపారు.