Chandrababu : విఘాతం కల్గిస్తే ఎవరీనీ ఊరుకోను : చంద్రబాబు

శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు

Update: 2024-07-22 12:13 GMT

chandrababu naidu

శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. అసెంబ్లీ కమిటీ హాల్‍లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూటమి నేతల సమావేశం జరిగింది. ఇసుక, శాంతిభద్రతలపై ప్రధానంగా చంద్రబాబు చర్చించారు. తొలిరోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉన్నానని, కక్షసాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని చంద్రబాబు అన్నారు. ప్రజలు మనల్ని కక్షసాధింపు కోసం గెలిపించలేదని గుర్తుపెట్టుకోవాలని ఎమ్మెల్యేలకు తెలిపారు.

వివేకా హత్య కేసులో....
వివేకా హత్య కేసులో నడిపిన నాటకాన్నే మళ్లీ మొదలు పెట్టారని చంద్రబాబు అన్నారు. వినుకొండ జిలానీ-రషీద్ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారన్నారు. ఇసుక జోలికివెళ్లొద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయన్న పలువురు ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. మూడు పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని కూడా నాదెండ్ల మనో హర్ ప్రస్తావించారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను. తన పార్టీ ఎమ్మెల్యేలు మద్దతిస్తారని పవన్ తెలిపిరాు. ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదని, అప్పుడే జగన్ ప్రభుత్వంపై విమర్శ చేస్తున్నారన్నారు. గవర్నర్ ప్రసంగాన్ని తొలిరోజే అడ్డుకోవడం సరైన పనేనా?అని ప్రశ్నించారు.


Tags:    

Similar News