ఉగాది నుంచే కొత్త జిల్లాలు... జగన్ స్పష్టీకరణ
ఉగాది నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించాలని కోరారు.
ఉగాది నుంచే కొత్త జిల్లాలు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించాలని ఆయన కోరారు. కొత్త జిల్లాల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కొత్త జిల్లాలకు ఓఎస్డీలుగా వ్యవహరించాల్సి ఉంటుందని జగన్ తెలిపారు. అప్పుడే వారికి కొత్త జిల్లాలపై అవగాహనతో పాటు వారి అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందని జగన్ అభిప్రాయపడ్డారు.
జిల్లా కార్యాలయాలను....
ఉగాది నుంచే కొత్త జిల్లాల్లో కలెక్టర్లు, పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయాలు ప్రారంభం కావాలని జగన్ ఆదేశించారు. ఇప్పటి నుంచే కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటు కోసం ప్రయత్నించాలని కోరారు. అందుబాటులో ఉన్న కార్యాలయాలను ప్రస్తుతానికి వాడుకుంటే, తర్వాత కొత్త కార్యాలయాల నిర్మాణం చేపట్టవచ్చని జగన్ అధికారులకు సూచించారు.