నేడు బాపట్లకు జగన్
నేడు బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన నగదును తల్లులు ఖాతాలకు బదిలీ చేస్తారు.
నేడు బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన నగదును తల్లులు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.10 గంటలకు జగన్ బాపట్ల చేరుకోనున్నారు. బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద తల్లుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదును బదిలీ చేయనున్నారు. అనంతరం సభలో ప్రసంగిస్తారు.
విద్యాదీవెన పథకం నిధుల విడుదల
అర్హులైన పేద విద్యార్థులు చదువుకునేందుకు ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేస్తుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్ధులకు ఈ పథకం కింద నగదును అందచేస్తారు. వీరు కట్టే ఫీజులు ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కింద ఈ నిధులను అందచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం కింద లబ్డి పొందనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే 694 కోట్ల రూపాయలు విడుదల చేసింది.