Ys Jagan : జగన్ మరో కీలక నిర్ణయం.. అదే జరిగితే?
ప్రభుత్వ పాఠశాలల్లో మరో సంస్కరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో మరో సంస్కరణకు వైఎస్ జగన్ ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ఐబీ సిలబస్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎస్‌సీఈఆర్‌టీ తో అంతర్జాతీయ విద్యా బోర్డు ఒప్పందం కుదుర్చుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందం జరగనుంది. ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ ఒప్పందం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది నుంచి...
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐబీ సిలబస్ లో విద్యాబోధన జరిగేలా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి ఐబీ విద్యాబోధనను ప్రవేశపెట్టాలన్న యోచనలో ఉన్నారు. తర్వాత ఏడాది రెండో తరగతిలో ప్రవేశపెట్టనున్నారు. ఇలా ప్రతి ఏడాది ఒక్కో తరగతిలో ఐబీ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టనున్నారని ప్రభుత్వం చెబుతుంది. ప్రపంచంలో పెరుగుతున్న పోటీని తట్టుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తీర్చిదిద్దాలని నిర్ణయించారు.