నేడు కోనసీమలో జగన్ పర్యటన
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన పర్యటన సాగనుంది. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.30 గంటలకు కోనసీమ జిల్లాక చేరుకుంటారు. జిల్లాలోని పి. గన్నవరం మండలం పెదపూడి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పుచ్చకాయలపేటకు వెళ్లి వరద బాధితులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు.
వరద బాధితులతో....
అనంతరం అరిగెలవారిపేట, ఉడిముడిలంకల్లో కూడా వరద బాధితులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. మధ్యాహ్నం 2.05 గంటలకు వాడ్రేవుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం వెల్లి వరద బాధితులతో సమావేశమై వారికి అందిన సహాయ చర్యలపై వాకబు చేస్తారు. సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి చేరుకుని ఆర్ అండ్ బి అతిధి గృహంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరద సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అక్కడే రాత్రికి బస చేస్తారు. బుధవారం కూడా సీఎం అక్కడే కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు.