Ys Jagan : "ఆడుదాం ఆంధ్ర" అసలు ఉద్దేశ్యమదే

మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

Update: 2024-02-13 14:30 GMT

మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముగింపు వేడుకలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆటలు, ఆరోగ్యం, వ్యాయామం పట్ల అందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి నైపుణ్యాలను వెలికి తీసి వారిని అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని ఆయన అన్నారు. వారిని గుర్తించి సరైన శిక్షణ ఇవ్వగలిగితే ఆణిముత్యాలు మనకు దొరుకుతాయని అభిప్రాయపడ్డారు.

ఉత్తమ క్రీడాకారులను గుర్తించి...
వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ లాంటి ఆటల్లో ప్రతిభ గల ఆటగాళ్లను వెలికి తీసి దేశానికి అందించడమే ముఖ్య ఉద్దేశ్యమని ఆయనఅన్నారు. గత కొద్ది రోజులుగా దాదాపు 25 లక్షల మంది క్రీడాకారులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్న జగన్ వివిధ స్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులను అందచేశామన్నారు. మొత్తం 12.21 కోట్ల ప్రైజ్ మనీని ఇచ్చామని చెప్పారు. అన్ని అసోసియేషన్లు ఇందులో భాగస్వామిగా మారి కార్కక్రమాన్ని సక్సెస్ చేయగలిగారని తెలిపారు. ఈ క్రీడల్లో ఉత్తమప్రతిభ కనపర్చిన పథ్నాలుగు మంది క్రీడాకారులను తాము దత్తత తీసుకుని తగిన శిక్షణ ఇస్తామని ఆయన తెలిపారు.


Tags:    

Similar News