జగన్ తో భేటీ తర్వాత సమ్మె విరమణ?

ఉద్యోగ సంఘాల నేతలతో నేడు ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు

Update: 2022-02-05 03:01 GMT

ఉద్యోగ సంఘాల నేతలతో నేడు ముఖ్యమంత్రి జగన్ సమావేశం కానున్నారు. మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చలు దాదాపు విజయవంతం కావడంతో ముఖ్యమంత్రి వద్దకు ఉద్యోగ సంఘాలు వెళ్లనున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్ తో చర్చించిన తర్వాతనే సమ్మె విరమణ ప్రకటన చేస్తారని చెబుతున్నారు. నిన్న అర్థరాత్రి వరకూ జరిగిన చర్చలలో ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరించింది.

అన్ని డిమాండ్డు....
ప్రధానంగా పీఆర్సీ, రికవరీ, హెచ్ఆర్ఏలో శ్లాబ్ లో సవరణలు, ఫిట్ మెంట్ విషయాలపై మంత్రుల కమిటీ సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. అయితే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరడంతో దానికి మాత్రం మంత్రుల కమిటీ ఓకే చెప్పలేదు. ముఖ్యమంత్రితో మాట్లాడి చెబుతామని మంత్రులు చెప్పారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక ను బయటపెట్టడంపై కూడా స్పష్టత రాలేదు. దీంతో ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చాలా వరకూ మంత్రుల కమిటీ అంగీకరించినందున ముఖ్యమంత్రితో భేటీ తర్వాత సమ్మె విరమణ ప్రకటన చేస్తారంటున్నారు. రేపు అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.


Tags:    

Similar News