Ys Jagan : నేడు వైఎస్సార్ కల్యాణమస్తు నిధులు విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా సాయన్ని లబ్దిదారులకు అందచేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా సాయన్ని లబ్దిదారులకు అందచేయనున్నారు. ఈ ఏడాది జులై నుంచి సెప్టంబరు మధ్యలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు వైఎస్సార్ తోఫా, షాదీ తోఫా నిధులను అందచేయనున్నారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నిధులు విడుదల చేయనున్నారు.
షాదీ తోఫా కింద....
ఈ పధకం కింద మొత్తం 81.64 కోట్ల రూపాయల నిధులను లబ్దిదారులకు అందచేయనున్నారు. వైఎస్సార్ కల్యాణ మస్తు పథకం కింద పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలని ఇందుకోసం కొన్ని అర్హతలు నిర్ణయించారు. పదోతరగతి ఉత్తీర్ణులయిన వారికే ఈ పథకం వర్తిస్తుంి. అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇప్పటి వరకూ ఈ పథకాల కింద 46,062 మంది లబ్దిదారులకు నాలుగు విడతలుగా 348 కోట్ల నిధులను విడుదల చేశారు.