వారితో జగన్ నేరుగా సమావేశం... నేడే

ఈరోజు ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ముఖ్యమంత్రి జగన్ నేరుగా సమావేశం అవుతారు.

Update: 2022-06-08 03:20 GMT

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేరవేయడానికి, వారి సమస్యలను తెలుసుకోవడానికి గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం చేపట్టింది. గత నెల 11వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి కొంత నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటం కూడా ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వచ్చింది. వారు వెకేషన్ కు ఫ్యామిలీతో వెళ్లినట్లు గుర్తించారు.

గడప గడప కు ప్రభుత్వం....
దీంతో నేడు జగన్ వారితో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు. నియోజకవర్గాల ఇన్ ఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో జగన్ నేరుగా సమావేశం అవుతారు. వారికి ఈ కార్యక్రమంపై దిశా నిర్దేశం చేస్తారు. ఏ సమస్యలు ప్రజల నుంచి వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చేయాల్సిన పనులేంటి అనే విషయాలపై జగన్ ఆరా తీయనున్నారు. 95 శాతం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేయాలని ఈ సందర్భంగా నేతలకు జగన్ వివరించనున్నారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి డైరెక్షన్ ఇవ్వనున్నారని తెలిసింది. దీనికి వర్క్ షాప్ అని పేరుపెట్టినప్పటికీ జగన్ నేతలకు క్లాస్ పీకుతారని సమాచారం.


Tags:    

Similar News