నేడు బాపట్ల జిల్లాలో జగన్ పర్యటన
బాపట్ల జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిీణీ చేయనున్నారు
బాపట్ల జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు పర్యటించనున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను పంపిీణీ చేయనున్నారు. ఈరోజు జగన్ పుట్టిన రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ట్యాబ్ లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జగన్ ఈ కార్యక్రమాన్ని బాపట్లలో ప్రారంభించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ఈ ట్యాబ్ లను మంత్రులు అంద చేయనున్నారు.
ట్యాబ్ ల పంపిణీ...
దాదాపు 4.59 లక్షల మంది విద్యార్థులు, 59,176 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్ లను నేడు పంపిణీ చేస్తారు. బైజూస్ యాప్ ను కూడా నేడు జగన్ ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లా చుండూరు మండలంయడ్లపల్లిలోని ఏవీఆర్ జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. ఉదయం పది గంటలకు తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరనున్నారు. జగన్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.