ఈ నెల 27 న ప్రకాశంకు జగన్

ప్రకాశం జిల్లాలో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఒక వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు;

Update: 2021-12-25 04:18 GMT

ప్రకాశం జిల్లాలో ఈ నెల 27వ తేదీన ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఒక వివాహ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్ లో జగన్ పాల్గొననున్నారు. ఈ నెల 27వ తేదీన యర్రగొండపాలెంలో వివాహ రిసెప్షన్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జగన్ తో పాటు మంత్రి వర్గ సభ్యులు హాజరుకానున్నారు.

పర్యటన కోసం....
ముఖ్యమంత్రి పర్యటన కోసం అన్ని ఏర్పట్లు చేస్తున్నారు. యర్రగొండపాలెంలని మార్కెట్ యార్డులో హెలిపాడ్ ను సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే వాహనాలను పార్కింగ్ చేయాలని, ఇందుకోసం పాస్ లను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు.


Tags:    

Similar News