Tirupathi : తిరుపతిలో విషాదం.. తొక్కిసలాటలో ఐదుగురు భక్తుల మృతి
తిరుపతిలో విషాదం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందారు.;
తిరుపతిలో విషాదం జరిగింది. వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందారు. దాదాపు యాభై మంది వరకూ గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో నలుగురు మహిళలతో పాటు ఒకపురుషుడుఉఉణ్నారు. మృతులను బుద్దేటి నాయుడుబాబు (నర్సీపట్నం), రజని ( విశాఖపట్నం) లావణ్య, శాంతిలతో పాటు బళ్లారికి చెందిన నిర్మలగా గుర్తించారు. శ్రీనివాసం వద్ద ఏర్పాటుచేసిన కేంద్రం వద్ద అంతకుముందేఅస్వస్థతకు గుడై తమళనాడు లోని సేలం ప్రాంతానికి చెందని మల్లిగ అని మహిళ మరణించింది. వీరంతా యాభై ఏళ్ల వయసు లోపు వారేనని అధికారులు తెలిపారు.
రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనం..
వైకుంఠ ద్వార దర్శనం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 19వ తేదీ వరకూ మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. అయితే గురువం ఉదయం నుంచి టోకెన్లు తిరుపతి, తిరుమలలో జారీ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ముందుగానే ప్రకటించారు. ఈ నెల 11, 12, 13 తేదీలకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్లు తీసుకోవడానికి భక్తులు పెద్దయెత్తున తరలి వచ్చారు. దీంతో జీవకోన, బైరాగపట్టెడ, శ్రీనివాసం, అలిపిరి వద్ద టిక్కెట్ల కేంద్రాలలో తొక్కిసలాట జరిగింది.
మూడు రాష్ట్రాల నుంచి...
భక్తులు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు తీసుకోవడానికి రావడంతోనే ఈ తొక్కిసలాట జరిగింది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా టోకెన్లు తీసుకోవడానికి భక్తుల ఒక్కసారిగా ఎగబడటంతో ఈ ప్రమాదం జరిగింది. జరిగిన ఘటన విషాదకరంగా మారింది. అక్కడకు వచ్చిన భక్తుల బంధువుల రోదనల మధ్య తిరుపతి నిండిపోయింది. గాయపడిన వారిలోకొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని భక్తుులు డిమాండ్ చేస్తున్నారు.