తిరుపతి ఘటనపై జగన్ ఏమన్నారంటే?
తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.;
తిరుపతిలో జరిగిన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. . వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు మృతి చెందిన ఘటన విషాదకరమని అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ వైఫల్యమే...
వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా మరణించడం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా తొక్కిసలాట జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఒకే రోజు 1.20 లక్షల టోకెన్లు జారీ చేయడంతోనే భక్తుల తొక్కిసలాటకు కారణమమయిందని జగన్ అభిప్రాయపడ్డారు.