నేడు విశాఖకు జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు

Update: 2023-10-16 03:24 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఐటీ సెజ్‌లో ఇన్‌ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయంలో వెయ్యి మంది ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు ఫార్మాసిటీలో కొత్తగా నిర్మించిన యూజియా స్టెరిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పాటు, లారస్ ల్యాబ్స్ లో నిర్మించిన అదనపు భవనాలను కూడా జగన్ ప్రారంభించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

అభివృద్ధి కార్యక్రమాలను...
ఉదయం 10.20 గంటలకు విశాఖకు చేరుకుని 11.55 గంటల వరకూ ఇన్‌ఫోసిస్ లోనే ఉంటారు. తర్వాత విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బీచ్ క్లీనింగ్ యంత్రాలను కూడా జగన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12.05 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లికి చేరుకోని అక్కడ పార్టీ నేతలతో కాసేపు మాట్లాడతారు. అనంతరం అచ్యుతాపురం ఎస్‌ఈజడ్‌కు చేరుకుని లారస్ ల్యాబ్ యూనిట్ 2ను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి విశాఖకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News