Ys Jagan : రేపు మూడు జిల్లాల్లో జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయింది;

Update: 2024-05-08 12:15 GMT
ys jagan, chief minister, tweet, andhra pradesh, X, after elections
  • whatsapp icon

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ విడుదలయింది. రేపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆయన రేపు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేరకు రేపటి షెడ్యూల్ విడుదల చేసింది.

మూడు నియోజకవర్గాల్లో...
గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కర్నూలు నగరంలో జరిగే జరిగే ప్రచార సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్ లో జరిగే సభ లో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట నియోజకవర్గంలో రైల్వే కోడూరు రోడ్ లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.


Tags:    

Similar News