Andhra Pradesh : రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌ల బదిలీ

62 మంది ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు;

Update: 2024-07-21 01:15 GMT
Andhra Pradesh : రాష్ట్రంలో 62 మంది ఐఏఎస్‌ల బదిలీ
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పిడిన తర్వాత పాలన పరమైన సౌలభ్యం కోసం వరసగా బదిలీలను చేస్తుంది. తాజాగా 62 మంది ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి శాఖలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

కృష్ణతేజను...
కేరళ క్యాడర్ కు చెందిన మైలవరపు కృష్ణతేజను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధఇ శాఖ డైరెక్టర్ గా నియమించారు. కృష్ణతేజ కేరళలో పనిచేసిన తీరును గుర్తించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనను ప్రత్యేకంగా ఏపీకి రప్పించుకున్నారు. వీరితో పాటు పలువురు ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. మొత్తం 62 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు.


Tags:    

Similar News