మార్గదర్శిలో సీఐడీ తనిఖీలు
ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిశాఖల్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తుంది. గాజువాక, సీతంపేట, తెనాలి మార్గదర్శి శాఖల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి
ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శిశాఖల్లో సీఐడీ సోదాలు నిర్వహిస్తుంది. గాజువాక, సీతంపేట, తెనాలి మార్గదర్శి శాఖల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. జనం నుంచి సేకరించిన డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డిపాజిట్ల మొత్తాన్ని...
మార్గదర్శిలోని వివిధ శాఖల్లో సోదాలు నిర్వహిస్తున్న సీైడీ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని గత కొంతకాలంగా ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా తనిఖీలు నిర్వహిస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.