Fibernet Case : ఏ1 గా చంద్రబాబు.. ఛార్జిషీట్ దాఖలు చేసిన సీఐడీ

ఫైబర్ నెట్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ 1 నిందితుడిగా సీఐడీ చేర్చింది.

Update: 2024-02-17 02:49 GMT

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ 1 నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఏ2 గా వేమూరి హరికృష్ణ, ఏ3గా కోగంటి సాంబశివరావు పేర్లను చేర్చింది. ఏసీబీ కోర్టులో ఛార్జి షీట్ దాఖలు చేయడంతో సీఐడీ మళ్లీ స్పీడ్ పెంచినట్లే కనపడుతుంది.

ఫైబర్ నెట్ కేసులో...
ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని మూడేళ్ల క్రితం సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫైబర్ నెట్ కేసు ద్వారా అప్పటి ప్రభుత్వంలోని పెద్దలు 114 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. తొలుత చంద్రబాబును 25వ నిందితుడిగా చేర్చిన సీఐడీ విచారణ అనంతరం ఏ1గా చేర్చడం విశేషం.


Tags:    

Similar News