Breaking : మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో సీబీఐ అధికారులు నోటీసులు పంపారు

Update: 2023-10-02 05:09 GMT

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో సీబీఐ అధికారులు నోటీసులు పంపారు. నారాయణకు వాట్సాప్ ద్వారా ఈ నోటీసులను పంపారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారాయణ ఎ2 నిందితుడిగా ఉన్నారు. దీంతో నారా‍యణను విచారించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఈ నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయనకు నోటీసుల్లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.

వాట్సాప్ లో పంపి...
ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసుకు సంబంధించి ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ కు కూడా నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో నారాయణను కూడా లోకేష్ తో పాటు విచారించాలని నిర్ణయించడంతో ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగానే అందరినీ విచారించేందుకు సిద్ధమయింది. 41 ఎ నోటీసులు ఇచ్చి విచారించమని కోర్టు చెప్పడంతో నారాయణకు కూడా నోటీసులు జారీ చేసింది.


Tags:    

Similar News