కాకినాడ పోర్టులో సీఐడీ తనిఖీలు
కాకినాడ సీ పోర్టులో ఈరోజు సీఐడీ అధికారులు దాడులు చేశారు.
కాకినాడ సీ పోర్టులో ఈరోజు సీఐడీ అధికారులు దాడులు చేశారు.దాదాపు ముప్ఫయి మంది సిబ్బందితో కలిసి సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే పోర్టు సిబ్బంది వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని నిలువరించి సోదాలను నిర్వహించారు. కాకినాడ సీ పోర్టు నుంచి పెద్దయెత్తు రేషన్ బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయన్న ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
బియ్యం అక్రమ రవాణాపై...
అయితే అదే సమయంలో సీఐడీ తనిఖీలతో బియ్యం అక్రమ రావాణా పై కూడా మరికొంత స్పష్టత వచ్చే అవకాశముంది. గత ప్రభుత్వ పాలన కాలంలో జరిగిన లావాదేవీలపై సీపోర్టులో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన పలు కీలక పత్రాలను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. సీఐడీ అధికారులు దీనపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.