మాజీ మంత్రి నారాయణ ఇంటికి సీఐడీ పోలీసులు
అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ ఇంటికి సీీఐడీ అధికారులు చేరుకున్నారు.
అమరావతి రాజధాని భూముల కుంభకోణం కేసులో మాజీ మంత్రి నారాయణ ఇంటికి సీీఐడీ అధికారులు చేరుకున్నారు. నారాయణతో పాటు ఆయన కుటుంబ సభ్యులను విచారిస్తామని ఇటీవల ఏపీ సీఐడీ అధికారులు 41 ఎ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన ఏపీ సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరు కావాలని నారాయణకు నోటీసులు జారీ చేశారు.
ఇంట్లోనే విచారణ...
అయితే నారాయణ దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం నారాయణను, ఆయన కుటుంబ సభ్యులను ఆయన ఇంట్లోనే విచారించాలని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారులు నారాయణను విచారించేందుకు వచ్చారు. రాజధానిలో పెద్దయెత్తున బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలను మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఏపీ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.