విజయసాయిరెడ్డికి లుక్ అవుట్ నోటీసులు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సీఐడీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై సీఐడీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విజయసాయిరెడ్డితో పాటు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో సంస్థకు చెందిన శరత్ చంద్రారెడ్డిపైనా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వీరు పారిపోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ లుక్ అవుట్ నోటీసులను సీఐడీ అధికారులు జారీ చేశారు.
కాకినాడ పోర్టు విషయంలో...
కాకినాడ పోర్టును కేవీ రావు నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన అంశంపై వీరి ముగ్గురిపై కేసు నమోదయిన నేపథ్యంలో ఈ చర్యలకు సీఐడీ దిగింది. ఈ కేసులో ముగ్గురు కీలక నిందితులుగా ఉండటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవీరావును బెదిరించి కాకినాడ పోర్టును సొంతం చేసుకున్నారన్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కేవీ రావును బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.