విశాఖ స్టీల్ ప్లాంట్ పై డబుల్ గేమ్ ; రామకృష్ణ
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ గేమ్ ఆడుతున్నాయని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈరోజు విశాఖలో స్టీల్ ప్లాంట్ పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటు సంస్థలకు అప్పగించేందుకే సిద్ధమవుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని రామకృష్ణ అన్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని చెబుతూనే, మరొక వైపు దానిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రామకృష్ణ అన్నారు. ఒకవైపు స్టీల్ ప్లాంట్ మూసివేయమని చెబుతూనే, మరొక వైపు మిట్టల్ చేత పరిశ్రమలను 70 వేల కోట్లతో స్థాపించడం వెనక కుట్ర ఉందని తెలిపారు.
ప్రయివేటీకరణ చేస్తే...
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ ను మూివేసే ప్రయత్నాలను అడ్డుకుని తీరాలని ఆయన పిలుపు నిచ్చారు. అందరం కలసి సంఘటితంగా ఈ ప్రయివేటీకరణను ఎదుర్కొనాలని ఆయన కోరారు. ఉమ్మడిపోరాటాలతోనే ప్రయివేటీకరణ ఆపడం సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికుల పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని అన్నారు. ఇది కేవలం విశాఖకు మాత్రమే కాదని, ఏపీ సెంటిమెంట్ అని గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.