జిందాల్ తో ఒప్పందాన్ని రద్దు చేయాలి

విశాఖ స్టీల్ ప్లాంట్ కు హానికరమైన జిందాల్ తో ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు వర్కింగ్ కమిటీ సమావేశం స్టీల్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.

Update: 2023-12-23 04:45 GMT

Visakha Steel Plant

విశాఖ స్టీల్ ప్లాంట్ కు హానికరమైన జిందాల్ తో ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు వర్కింగ్ కమిటీ సమావేశం స్టీల్ సిఐటియు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి విచ్చేసిన సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ స్టీల్ యాజమాన్యం వాటిని పరిగణనలోకి తీసుకోకుండా జిందాల్ తో ఒప్పందం చేసుకోవడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశంలోని ప్రభుత్వ రంగ పరిశ్రమలను అప్పగించడం కోసం జరిగే కుట్రగా దీనిని ఆయన అభివర్ణించారు. దీనికోసం స్థానిక స్టీల్ యాజమాన్యం నేటి వరకు జరుగుతున్న ఐక్య ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ ఐక్య ఉద్యమాన్ని కొనసాగించే విధంగా కార్మిక వర్గం చైతన్యంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.



స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ జిందాల్ తో ఒప్పందం ద్వారా కర్మగారానికి నష్టం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమయంలో కార్మిక వర్గంలో పెరుగుతున్న అనుమానాలను నివృత్తితోపాటు స్పష్టమైన కార్యాచరణను రూపొందించడమే సిఐటియు కార్యకర్తల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కనుక సిఐటియు కార్యకర్తగా పూర్తి సమాచారాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు రామస్వామి, స్టీల్ సిఐటియు అధ్యక్షులు వై టి దాస్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపడం ద్వారా ఇది కాపాడబడుతుందని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ ఉన్నత యాజమాన్యం అవగాహన రాహిత్యంతో చేసే పనులు కార్మిక వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆయన వివరించారు. కనుక వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవని ఆయన స్పష్టం చేశారు. ఇదే వైఖరితో యాజమాన్యం ప్రవర్తిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో జిల్లా సిఐటియు నాయకులు కె జగ్గు నాయుడు, కె ఎం శ్రీనివాస్, 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, స్టీల్ సిఐటియు నాయకులు యు వెంకటేశ్వర్లు, కెవి సత్యనారాయణ,టివి కె రాజు, పుల్లారావు తదితరులతోపాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో వర్కింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Full View


Tags:    

Similar News