రిషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్‌.. మంత్రి క్లారిటీ

విశాఖ రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్‌ వసూలుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ క్లారిటీ ఇచ్చారు.

Update: 2023-07-10 03:48 GMT

విశాఖపట్నం రుషికొండ బీచ్‌ కు వెళ్లే సందర్శకులు ఇక నుంచి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. బీచ్‌లోకి వెళ్లేవారికి ఎంట్రీ ఫీజు రూ. 20గా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పదేళ్లలోపు వారికి మాత్రం మినహాయింపు ఉంటుంది. వాహనాల పార్కింగ్ కు కూడా ఫీజు వసూళ్లు చేస్తారని తెలుస్తోంది. ద్విచక్ర వాహనానికి రూ. 10, కారు, జీపులు రూ. 30, బస్సులు రూ. 50 చెల్లించాల్సి చెల్లించాల్సి ఉంటుందని వార్తలు వచ్చాయి. రుషికొండ బీచ్ ను కేంద్ర ప్రభుత్వం బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా గుర్తించింది. దీంతో అక్కడ కొన్ని నిబంధనలు అమలు చేయాల్సి ఉంది. పరిశుభ్రమైన తాగు నీరు, టాయిలెట్లు, స్నానాల గదులు, పిల్లలు ఆడుకోవడానికి ఏర్పాట్లు చేశారు. బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు క్లీనర్లు, సెక్యూరిటీ, లైఫ్‌ గార్డులు మొత్తం 39 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారి జీతాభత్యాలు, ఇతర పనులకు నెలకు రూ.6 లక్షల ఖర్చు అవుతుంది.

విశాఖ రుషికొండ బీచ్‌కు ఎంట్రీ ఫీజ్‌ వసూలుపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ క్లారిటీ ఇచ్చారు. రుషికొండ బీచ్‌ను బ్లూఫాగ్‌బీచ్‌గా ప్రకటించారని.. బీచ్‌లో సదుపాయాల కల్పనకు సందర్శకుల నుంచి రూ.20 వసూలు చేయాల్సి ఉంటుందని కేంద్రమే ప్రతిపాదించిందని చెప్పారు. కానీ పర్యాటకులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యాటకశాఖ భరించేలా నిర్ణయించామన్నారు. ఎలాంటి రుసుములు వసూలు చేయబోమని.. సందర్శకులపై భారం పడకుండా చూస్తామన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే బీచ్‌ నిర్వహణ తీసుకుంటుందని.. ఈ అంశంపై సీఎం జగన్‌తో చర్చిస్తామన్నారు.
రుషికొండ బీచ్ లో ఎంట్రీ ఫీజు పెడుతున్నట్లు వచ్చిన ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. బీచ్ ల వద్ద పార్కింగ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు పెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఈ ఎంట్రీ టిక్కెట్లపై వెంటనే పునారాలోచన చేయాలని కోరారు.


Tags:    

Similar News