అచ్చెన్న పై సీఎం జగన్ సీరియస్.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు !

గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సీఎం గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ..;

Update: 2022-03-07 11:36 GMT
అచ్చెన్న పై సీఎం జగన్ సీరియస్.. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు !
  • whatsapp icon

అమరావతి : టిడిపి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలిరోజు అసెంబ్లీ సమావేశంలో టిడిపి అనుసరించిన వైఖరిని సీఎం ఖండించారు. గవర్నర్ ప్రసంగాన్ని టిడిపి సభ్యులు అడ్డుకుని, ఆయనను అవమానించారంటూ బీఏసీ సమావేశంలో అచ్చెన్నపై సీరియస్ అయ్యారు. అసెంబ్లీ సమావేశం అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది.

Also Read : సరిహద్దుల వద్ద ఆకుపచ్చ సంచితో పాక్ డ్రోన్ కలకలం..

ఈ సమావేశానికి సీఎం జగన్ తో పాటు మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ యాదవ్, చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి, టిడిపి తరపున అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గవర్నర్ మీ పార్టీ కాదు.. మా పార్టీ కాదని స్పష్టం చేశారు. వయస్సులో అంత పెద్ద వ్యక్తిని అవమానించడం సరికాదన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని సీఎం గుర్తుచేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం మొదలు కాగానే టిడిపి సభ్యులు గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే వెల్ లోకి దూసుకొచ్చి గవర్నర్ ప్రతులను చింపి విసిరేశారు టిడిపి సభ్యులు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేశారు టిడిపి సభ్యులు.



Tags:    

Similar News