ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్ !

ఏపీలో కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కు సవరించిన అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే విభజన చట్టం;

Update: 2022-04-05 08:56 GMT
ఢిల్లీకి బయల్దేరిన సీఎం జగన్ !
  • whatsapp icon

విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఈ భేటీలో పలు కీలక అంశాలను ప్రధానితో చర్చించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.

ఏపీలో కొత్తజిల్లాల ఏర్పాటుతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కు సవరించిన అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు సమాచారం. అలాగే విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అంశాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానితో భేటీ ముగిసిన అనంతరం.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 9.30 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.


Tags:    

Similar News