చంద్రబాబు వాలంటీర్ ఎవరో చెప్పిన సీఎం జగన్

గత కొద్దిరోజులుగా ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన చర్చ సాగుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల

Update: 2023-07-21 08:06 GMT

గత కొద్దిరోజులుగా ఏపీలో వాలంటీర్లకు సంబంధించిన చర్చ సాగుతూ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల ద్వారా డేటా బయటకు వెళుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అధికార వైసీపీ కూడా ఘాటుగా స్పందించింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలకు మంచి చేస్తున్న వాలంటీర్ల సేవలను తప్పుబడుతున్నారని అన్నారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్ ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసని అన్నారు.. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారా? పెళ్లిళ్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం పవన్‌ కళ్యాణ్ క్యారెక్టర్‌ అని అన్నారు. అలాంటి వ్యక్తా వలంటీర్ల గురించి మాట్లాడేదని అన్నారు. ఒకరిని వివాహం చేసుకుని.. మరొకరితో అక్రమ సంబంధంపెట్టుకునే వ్యక్తా వాలంటీర్ల వ్యక్తిత్వం గురించి మాట్లాడేదంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరొకడేమో యూట్యూబ్ లో డ్యాన్సులు చేస్తూ కనిపిస్తాడు.. ఇంకొకడేమో ‘అమ్మాయిలు కనిపిస్తే ముద్దులు పెట్టుకోవాలి.. కడుపు చేయాలి’ అంటాడు. ఒకరు టీవీ షోకి వెళ్లి ‘బావా మీరు సినిమాల్లో చేశారు.. నేను నిజంగా చేశాను’ అంటాడని విమర్శలు గుప్పించారు. ఒక్కడిదేమో బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో సంసారం. ఇచ్చేది బీ ఫామ్.. టీడీపీకి బీ టీం అని అన్నారు. వాలంటీర్ల క్యారెక్టర్ గురించి కోట్ల మంది ప్రజలకు తెలుసు. వాలంటీర్ల క్యారెక్టర్ ను తప్పుబట్టింది.. బాబుకు పదేళ్లుగా వాలంటీర్ గా ఉంటున్న ఈ ప్యాకేజి స్టార్ అని అన్నారు. ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈయన మన వాలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. ఉదయాన్నే తలుపు తట్టి మంచి చెడులు అడిగే వాళ్లు. అవినీతి, వివక్ష తెలియని మంచివాళ్లు వాలంటీర్లు. వాళ్లంతా మన గ్రామం పిల్లలే.. మన వాళ్లే. అలాంటి వాళ్లపై అన్యాయంగా బురద జల్లుతున్నారు. సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ వాలంటీర్లను అవమానించరని సీఎం జగన్‌ అన్నారు. వాలంటీర్లపై తప్పుడు మాటలకు స్క్రిప్ట్‌ రామోజీరావుది. నిర్మాత చంద్రబాబైతే.. నటన, మాటలు అన్నీ కూడా దత్తపుత్రుడివే. వాలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని, ట్రాఫికింగ్‌ చేస్తున్నారని, మహిళలను ఎక్కడికో పంపిస్తున్నారని నిసిగ్గుగా ఒకరంటున్నారు. వలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారు. పైగా సిగ్గులేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఆ రాతలను ప్రచురిస్తున్నాయని ధ్వజమెత్తారు సీఎం జగన్.


Tags:    

Similar News