మీ బిడ్డ మిమ్మల్ని మోసం చేయడు: సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నిడదవోలులో
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. నిడదవోలులో ‘వైఎస్సార్ కాపు నేస్తం’ నాలుగో విడత ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అర్హులైన 3,57,844 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 536.77 కోట్లు జమ చేస్తున్నామని చెప్పారు. పేద కాపు మహిళలకు, ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యమని అన్నారు. నాలుగు లక్షల మంది కాపు నేస్తం పథకం ద్వారా లబ్ధిపొందినట్లు తెలిపారు. మీ బిడ్డ చెప్పిన ఎన్నో హామీలను పూర్తీ చేశాడు.. బిడ్డ మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేయడని అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
లంచాలకు అవినీతికి తావులేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేయలేదని సీఎం చెప్పారు. కులం, మతం రాజకీయాలు చూడకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 2.30 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించామని చెప్పారు. నాన్ డీబీటీ ద్వారా కాపు వర్గానికి రూ. 16,914 కోట్ల లబ్ధి చేకూరిందని అన్నారు. ఇది ప్రజలందరి ప్రభుత్వమని అన్నారు.