రైతన్నకు వైఎస్సార్ యంత్రం
వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళ-2ను సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగామేళాలో భాగంగా గుంటూరులో
వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగా మేళ-2ను సీఎం జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం మెగామేళాలో భాగంగా గుంటూరులో రైతు సంఘాలకు రూ.361 కోట్లు విలువ గల 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి 13,573 ఇతర వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసి, రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని రైతు సంఘాల ఖాతాల్లోకి పంపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ యంత్రాలు అందించి రైతులను ఆదుకున్నామన్నారు.
రైతులను వారి కాళ్లపై నిలబడేలా చేశామని చెప్పారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకంలోని ముఖ్యాంశాలను ముఖ్యమంత్రి వివరిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6,525 రైతు భరోసా కేంద్రాలు, 391 క్లస్టర్ లెవల్ సీహెచ్‌సీల ద్వారా తక్కువ ధరకు పనిముట్లను అందజేస్తోందన్నారు. రూ.361.29 కోట్లతో ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు అందించామని, ఒక్కో ఆర్ బీకే కేంద్రంలో యంత్రాల కోసం రూ.15 లక్షలు కేటాయించామని తెలిపారు. అక్టోబర్‌లో 7 లక్షల మందికి లబ్ధి చేకూరేలా యంత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతులందరినీ బాగు చేయడమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల పక్షాన నిలబడి గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చామని చెప్పారు.
రైతన్నకు అండగా యంత్ర సేవా పథకం తీసుకొచ్చామన్నారు. రైతులకు ఏం అవసరమో వారినే అడిగి అందజేస్తామన్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలోని రైతన్నలకు వ్యవసాయ పనిముట్లు అందించామన్నారు. రైతుల కోసం ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలను తక్కువ అద్దెకే చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి రైతులకు వ్యయం తగ్గించి, నికర ఆదాయం పెంచాలన్న ఆలోచనలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టారు.