రైతుల పాదయాత్రలో పాల్గొంటా.. స్పష్టత ఇచ్చిన సీఎం రమేష్

అమరావతిలో రాజధాని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో తాను పాల్గొంటానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు.

Update: 2021-11-15 14:41 GMT

అమరావతిలో రాజధాని కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న మహా పాదయాత్రలో తాను పాల్గొంటానని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తెలిపారు. రైతుల మహాపాదయాత్ర ముగింపు దశలో తాను పాల్గొంటానని చెప్పారు. అమిత్ షాతో పొత్తుల గురించి తాము చర్చించలేదన్నారు. ఆ ప్రస్తావనే రాలేదన్నారు. బీజేపీ ఏపీలో సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తెలంగాణ తరహాలు ఉద్యమాలు చేయాలని అమిత్ షా సూచించారన్నారు.

ఇది సమయం కాదు...
పొత్తులపై చర్చించేందుకు ఇది సమయం కాదని సీఎం రమేష్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉందన్నారు. తమకు వైసీపీ, టీడీపీ ప్రధాన శత్రువులని సీఎం రమేష్ తెలిపారు. తాము ఐక్యంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. అమిత్ షా అనేక విషయాలపై తమకు స్పష్టత ఇచ్చారని సీఎం రమేష్ తెలిపారు.


Tags:    

Similar News