సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడకుండా ఉన్నది అందుకేనట
శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతారని అందరూ భావించారు. కానీ ఆయన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జలుబు, దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వైరల్ ఫీవర్ కు చికిత్స తీసుకున్నా ఇప్పటికీ అది పూర్తిగా తగ్గలేదు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ మాట్లాడుతారని అందరూ భావించారు. కానీ ఆయన మాట్లాడలేదు. సీఎం జగన్ మాట్లాడకుండా, తన ఛైర్ లో కూర్చుండిపోయారు. అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతుండగా చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సమాచారం జగన్ కు అందింది. ఈ విషయం గురించి కూడా ఆయన సభలో మాట్లాడకుండా.. ఒక స్లిప్ ను బుగ్గనకు పంపించారు. స్లిప్ చదివిన బుగ్గన చంద్రబాబు విషయాన్ని సభలో ప్రకటించారు.
ఇక కాకినాడలో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత లబ్ధి విడుదల కార్యక్రమం జరగనుంది. సెప్టెంబర్ 29న జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక రంగరాయ వైద్యకళాశాల క్రీడామైదానంలో సభా వేదిక ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి వైఎస్సార్ వాహనమిత్ర పథకం అమలు చేస్తోంది.అర్హులైన టాక్సీ, ఆటో డ్రైవర్లు, యజమానులకు ఏటా రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది.