నగరిలో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంత్రి రోజా నియోజకవర్గమైన నగరికి

Update: 2023-08-28 03:02 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మంత్రి రోజా నియోజకవర్గమైన నగరికి వెళ్లనున్నారు. జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా విద్యార్థులకు డబ్బులు విడుదలజేయనున్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చబోతున్నారు. వారి ఫీజును పూర్తిగా రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. ఇందుకోసం బటన్‌ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ కోర్సులు , ఐటీఐ వంటి సంస్థల్లో చదువుకోవడానికి లబ్దిదారులకు డబ్బును ఇస్తోంది ప్రభుత్వం.

ఉదయం 10:15 గంటలకు నగరి చేరుకోనున్న సీఎం జగన్‌, అక్కడి టవర్‌ క్లాక్‌ సెంటర్‌ నుంచి సభాస్థలి వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. అనంతరం జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో భాగంగా బటన్ నొక్కి నేరుగా తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. నగరి బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులకు భోజన, వసతి ఖర్చులను ప్రభుత్వం జగనన్న వసతి దీవెన కింద చెల్లిస్తోంది. ప్రతీ సంవత్సరం రెండు విడతలుగా ఇస్తోంది. ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ స్టూడెంట్స్‌కి రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులు చదివే వారికి రూ.20 వేల చొప్పున ఇస్తోంది.


Tags:    

Similar News