విదేశాలకు వెళ్లేందుకు జగన్‌, విజయసాయికి కోర్టు అనుమతి

విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌,ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది

Update: 2023-08-31 11:45 GMT

విదేశాలకు వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్‌,ఎంపీ విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. విదేశాల్లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి తప్పనిసరి. యూకే పర్యటనకు వెళ్లడం కోసం నాంపల్లిలోని సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్ళరాదని బెయిల్ షరతులు ఉండడంతో వాటిని సడలించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగించిన న్యాయస్థానం సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ నేడు ఆదేశాలు జారీ చేసింది

సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతులు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు ముగించిన న్యాయస్థానం సీఎం విదేశీ పర్యటనకు అనుమతిస్తూ నేడు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్‌ 2 నుంచి 12 రోజులు లండన్‌ వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్,జర్మనీ,దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.


Tags:    

Similar News