5న తిరుపతి సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే !

తిరుపతిలో జగన్ పర్యటన నేపథ్యంలో నిన్న జనసేన నేతలు వినూత్న ప్రచారం చేశారు. ఇటీవల ఒంగోలులో తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి..

Update: 2022-05-02 05:51 GMT

తిరుపతి : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 5న తిరుపతిలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నారు. అలిపిరి వద్ద టిటిడి రూ.240 కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం టాటా క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం తిరుపతిలో నిర్వహించే జగనన్న విద్యాకానుక బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇటీవలే పునర్నించిన శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉండగా.. తిరుపతిలో జగన్ పర్యటన నేపథ్యంలో నిన్న జనసేన నేతలు వినూత్న ప్రచారం చేశారు. ఇటీవల ఒంగోలులో తిరుపతి వెళ్తున్న భక్తుల నుంచి.. సీఎం జగన్ కాన్వాయ్ కి కారు అవసరమైందంటూ వారి కారును తీసేసుకున్నారు పోలీసులు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చిన్న పిల్లలున్నారు.. ఇబ్బంది అవుతుందని ఎంత చెప్పినా వినకుండా నడిరోడ్డుపై కుటుంబాన్ని దింపేసి కారును తీసుకెళ్లారు. సీఎం జగన్ తిరుపతి వస్తున్నాడని, స్థానిక ప్రజలు, తిరుమలకు వచ్చే యాత్రికులు కార్లు జాగ్రత్తగా ఉంచుకోవాలని హెచ్చరిస్తూ దండోరా వేశారు. జనసేన పార్టీ తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నేతృత్వంలో ఈ దండోరా కార్యక్రమం నిర్వహించారు.





Tags:    

Similar News