గ్రహణం వేళ నడిరోడ్డుపై నాగుపాము హల్ చల్.. అరగంట నిలిచిన ట్రాఫిక్ (Video)
పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిల్చుంది. వెళ్తూ.. వస్తున్న వాహనాలను..
పామును చూస్తే చాలు.. దాదాపు అందరూ భయపడుతారు. దానికి మనం ఎలాంటి హాని తలపెట్టనంతవరకూ అదికూడా ఎవరినీ ఏమీ చేయదు. మామూలుగా ఏదో బురద పాము కనిపిస్తేనే హడలిపోతాం. కానీ.. నాగుపాము కనిపిస్తే ? అది కూడా నడిరోడ్డుపై ఉంటే ? సరిగ్గా ఇదే జరిగింది ప్రకాశం జిల్లాలో. దోర్నాల - మార్కాపురం ప్రధాన రహదారిలో ఉన్న నడిరోడ్డుపై నాగుపాము దర్శనమిచ్చింది.
పెద్దారవీడు మండలం బద్విడు చెర్లోపల్లి వద్ద ఓ నాగుపాము నడిరోడ్డు పై పడగా విప్పి నిల్చుంది. వెళ్తూ.. వస్తున్న వాహనాలను పాము వెంబడిస్తుండటంతో.. ఎక్కడకక్కడే వాహనదారులు ఆగిపోయారు. దీంతో ఆ రహదారిలో వాహనాలన్నీ సుమారు అరగంట సమయం పాటు నిలిచిపోయి ట్రాఫిక్ ఏర్పడింది. ఈ దృశ్యాన్ని వాహనదారులు వీడియోలు తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఇదంతా మంగళవారం సాయంత్రం చంద్రగ్రహణం సమయంలో జరిగింది. గ్రహణం వీడాక నాగుపాము రోడ్డుపై నుంచి వెళ్లిపోవడం వాహనదారులను విస్మయానికి గురి చేసింది. కొద్దిసేపటికి నాగుపాము దానంతట అది వెళ్లిపోవడంతో.. వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.