పెరిగిన చలి తీవ్రత.. ఇబ్బంది పడుతున్న జనం

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు

Update: 2022-11-20 04:14 GMT

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకూ చలి గాలుల తీవ్రత తగ్గడం లేదు. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. చలికి వృద్ధులు, చిన్న పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

రెండు రాష్ట్రాల్లో...
తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. సంగారెడ్డి జిల్లా సత్వార్ లో 7.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ గత రెండు రోజుల నుంచి చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అరకులోయలో 11 డిగ్రీలు, చింతపల్లిలో 9.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.


Tags:    

Similar News