నేడు ఉచిత బస్సు పై మంత్రుల రాష్ట్రాల పర్యటన
మహిళలకు ఉచితబస్సు ప్రయాణంపై నియమించిన కమిటీ రాష్ట్ర పర్యటనకు బయలుదేరనుంది.;
మహిళలకు ఉచితబస్సు ప్రయాణంపై నియమించిన కమిటీ రాష్ట్ర పర్యటనకు బయలుదేరనుంది. నేటి మంత్రివర్గం పూర్తయిన తర్వాత వీరు రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గసభ్యులు నేడు కర్ణాటక, తెలంగాణల్లో పర్యటించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకంపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో వీరి పర్యటన సాగనుంది.
కర్ణాటక, తెలంగాణలలో...
అదే సమయంలో ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మార్చి అంటే ఉగాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన నేపథ్యంలో వీలయినంత త్వరగా మంత్రుల కమిటీ పర్యటించి నివేదిక అందించేందుకు సిద్ధమయింది. అందులో ఉన్న లాభనష్టాలతో పాటు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఈ నివేదికలో ప్రస్తావించనున్నారు.