Ys Sharmila : పలుగు, పార పట్టిన షర్మిల ఉపాధి హామీ కూలీలతో కలిసి

యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు

Update: 2024-05-07 05:59 GMT

యోగి వేమన యూనివర్సిటీ ప్రాంగణంలో ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కింద ఎటువంటి వసతుల కల్పన లేదని .రోజంతా కష్టపడినా రెండు వందల రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని కూలీలు షర్మిల రెడ్డి దృష్టికి తీసుకు వచ్చారు. కూలీలకు భరోసా నింపేందుకు తాను సైతం పలుగు,పార పట్టి మట్టిని వైెఎస్ షర్మిల తవ్వారు. కాసేపు వారితో గడిపారు.

జగన్ ఒక చేత్తో ఇచ్చి...
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నీరు గార్చాయన్నారు. పొద్దంతా పని చేస్తే ఇచ్చే వేతనం 200 కన్నా మించడం లేదన్నారు. వృద్దులకు 150 కన్నా ఎక్కువ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ హయాంలో, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం పండుగలా సాగిందని షర్మిల గుర్తు చేశారు. కూలీలకు పని తో పాటు వసతుల కల్పన కూడా ఉండేదని, ఇప్పుడు కనీసం మంచినీరు కూడా ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన వెంటనే ఉపాధి హామీ కూలీలకు రోజు వేతనం 400 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. జగన్ బటన్ నొక్కుతున్నా అని చెప్పి ఉన్నది గుంజుకున్నాడంటూ ఆమె ఆరోపించారు. ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి...మరో చేత్తో వెండి చెంబు తీసుకున్నాడని అన్నారు.


Tags:    

Similar News