కడప జిల్లాకు ఆ పేరు పెట్టండి
కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కోరారు
కడప జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి కోరారు. కడప జిల్లాకు విశిష్ట ప్రాముఖ్యత ఉందన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామికి నిలయమైన తిరుమలకు తొలి గడప కడపగా అందరూ భావిస్తారన్నారు. కడపకు ఆధ్మాత్మిక, చారిత్రాత్మక విశిష్టత ఉందని తులసి రెడ్డి అన్నారు. 1835 దశకంలో ఏర్పడిన కడప జిల్లా చారిత్రాత్మకంగా ఎంతో పేరు ఉందన్నారు.
వైఎస్సార్ కడప జిల్లాగా.....
ిఅయితే 2009లో జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారన్నారు. కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన విశిష్ట సేవలకు కృషిగా ఆయన పేరు పెట్టడంలో తప్పులేదని తులసి రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే మరోసారి జిల్లాల పేర్లుమార్పు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది కాబట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గౌరవించుకుంటూనే, మరోవైపు కడప విశిష్టత మరుగున పడిపోకుండా వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చాలని తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.