ఇరకాటంలో ఉండవల్లి శ్రీదేవి

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2021-12-31 08:06 GMT

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి లో జరిగిన ప్రపంచ నాల్గవ మాదిగల దినోత్సవంలో ఆమె ప్రసంగించారు. అంబేద్కర్ వల్ల దళితులకు హక్కులు రాలేదని, బాబూ జగజ్జీవన్ రామ్ వల్లనే మాదిగలకు హక్కులు వచ్చాయని ఉండవల్లి శ్రీదేవి అన్నారు. బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే దానిని అమలు చేసింది బాబూ జగజ్జీవన్ రామ్ అని ఉండవల్లి శ్రీదేవి అన్నారు.

పార్టీ నుంచి బహిష్కరించాలని....
ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దళిత సంఘాలు ఉండవల్లి శ్రీదేవిపై మండి పడుతున్నాయి. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ వెంటనే పార్టి నుంచి ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


Tags:    

Similar News