ఏపీ పాఠశాలల్లో కరోనా కలకలం

ఏపీ విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతుంది. ఒక్కరోజులోనే పాఠశాలల్లో 17 పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది

Update: 2022-01-19 03:50 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యాసంస్థల్లో కరోనా కలకలం రేపుతుంది. ఒక్కరోజులోనే పాఠశాలల్లో 17 పాజిటివ్ కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. ఇందులో పదిహేను మంది ఉపాధ్యాయులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. వీరంతా ప్రస్తుతం హోం ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఒంగోలు, మార్కాపురం, కనిగిరి, అద్దంకి, సింగరాయకొండ, టంగుటూరు, కొణిజేడు, పంగులూరు, యద్దనపూడి మండలాల్లో ఈ కేసులు నమోదయ్యాయి.

సెలవులను....
సంక్రాంతి సెలవుల తర్వాత ఏపీ ప్రభుత్వం సెలవులను పొడిగించలేదు. కరోనా కేసులు పెరుగుతున్నా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ప్రభుత్వం పాఠశాలలను కొనసాగించడానికే మొగ్గు చూపింది. దీంతో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.


Tags:    

Similar News